నాన్న చనిపోయినా నాన్నను ఊహించుకుని పాత్రలు రాస్తున్నామని చాలా మంది చెబుతారని కార్తీక్ పేర్కొన్నారు. నాన్న అరుపుకే భయపడేవాళ్లమని కార్తీక్ కామెంట్లు చేశారు. అన్నయ్యకు చదువు విషయం లో నాన్న సూచనలు ఇచ్చేవారని కార్తీక్ చెప్పుకొచ్చారు. షూటింగ్ లేకపోతే నాన్న కార్డ్స్ ఆడేవారని కార్తీక్ అన్నారు. నాన్న రియల్ ఎస్టేట్ కూడా చేశారని ఆయన అన్నారు. నాన్న బ్రతికి ఉంటే రాజకీయాల్లో కి వచ్చేవారని కార్తీక్ పేర్కొన్నారు. నాన్నకు రెక్టల్ క్యాన్సర్ వచ్చిందని కార్తీక్ చెప్పుకొచ్చారు. క్యాన్సర్ వచ్చాక కూడా నాన్న సినిమా ల్లో కొనసాగారని కార్తీక్ వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత నాన్న 20 సినిమాలు చేశారని ఆయన అన్నారు. కార్తీక్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆహుతి ప్రసాద్ భౌతికంగా మరణించినా ప్రజల హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి