మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్యమూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇకపోతే రామ్ చరణ్ ... శంకర్ కాంబో లో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్ లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను 20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒకా నొక సమయంలో ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ ని 2024 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశాడు. మరి ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: