అయితే స్టార్ట్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ ఎదగడం వెనుక ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పవచ్చు. తన కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ తను కష్టపడుతూ స్టార్ పొజిషన్లోకి చేరుకున్నారు. ఒకానొక సమయంలో స్టార్ పోసిషన్ లో ఉన్న పూరి జగన్నాథ్ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలను కూడా మోసపోయారట.ఈ విషయాన్ని తాజాగా పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజీ ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తన కొడుకు గురించి మాట్లాడుతూ తన కొడుకు పూరి పడ్డ కష్టం మరెవరు కూడా పడకూడదని డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాదుకు వచ్చి ఎన్నో ఆఫీసులో చుట్టూ తిరిగి అన్నం నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా ఉండేవారని తనకి చిన్న వయసు నుంచి సినిమాలు అంటే పిచ్చి అని.. ఆ కారణంగానే హైదరాబాద్ కి వచ్చి సినిమా డైరెక్టర్గా స్థిరపడాలని చాలా కలలు కన్నారు. ఒకానొక సమయంలో తన కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవని.. తన కుమారుడిని చూసి చాలాసార్లు ఏడ్చానంటూ తెలిపింది. పూరి జగన్నాథ్ దగ్గర ఒక కుర్రాడు పని చేశారని అతడు రూ .80 కోట్లు మోసం చేశారని అలాగే సినిమాల వల్ల కూడా చాలా నష్టం వచ్చిందని తెలిపింది దీంతో ఒక్కసారిగా తన ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కానీ తన కుమారుడు మాత్రం ఆ మోసం చేసిన వ్యక్తిని ఒక్క మాట కూడా అనలేదని వాడికి ఏ జన్మలో రుణపడి ఉన్నామేమో అందుకే ఇలా జరిగిందని సైలెంట్ ఉండమని సలహా ఇచ్చారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి