
ఎన్నో వివాదాలు తో మలుపులతో తెరకెక్కించిన ఆర్జీవి వ్యూహం ఈనెల 23వ తేదీన రిలీజ్ కాబోతోంది.. వైయస్సార్ మరణం నుంచి జగన్ పైన జరిగిన కొన్ని కుట్రలు.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుల వ్యవహారం పైన కూడా వ్యూహం సినిమాని ఉన్నట్టుగానే చూపించినట్లు ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. రెండవ భాగం శపథం సినిమా కూడా జగన్ అధికారంలోకి రావడం ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల ఆధారంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పైన కూడా చూపించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఎలా ఉపయోగించుకొని తన రాజకీయాల చేతిలో పవన్ కళ్యాణ్ ఎలా పాముగా మారారు అనే విషయాన్ని కూడా చూపించారు. కల్పిత పాత్రలలోనే కాకుండా నేరుగా ఏపీ రాజకీయాలను వాస్తవ రూపంలో చూపించే ప్రయత్నంలో వర్మ ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.పాత్రల పేర్లు కూడా మార్చకుండా వ్యక్తిగత పేర్లను సైతం పెట్టేశారు రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వ్యూహం సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొంతమంది కేసులు వేయడం వల్ల వాయిదా వేయడం జరిగింది.. ఈనెల 23న వ్యూహం సినిమా విడుదల కాక మార్చి 1 న తేదీన శపథం సినిమా రిలీజ్ కాబోతోంది.