ఇక ఇలాంటి క్రమంలోనే ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంత గ్యాప్ అయితే తీసుకుంది. ఇక 2008 వ సంవత్సరంలో జగపతిబాబు హీరోగా చక్రవర్తి డైరెక్షన్ లో వచ్చిన ‘హోమం’సినిమాలో నటించింది. అలాగే 2010 వ సంవత్సరంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘రంగ ది దొంగ’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడంతో ఇక ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు దాంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని తను లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అప్పుడు ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న సాక్షి శివానంద్ ప్రస్తుతం చాలా హ్యాపీగా తన ఫ్యామిలీ ని లీడ్ చేస్తుంది…తెలుగు లో ఒక మంచి క్యారెక్టర్ దొరికితే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి