గడిచిన రెండు రోజుల క్రితం నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు గీతాంజలి.. టిడిపి జనసేన పార్టీల ట్రోలింగ్ వల్ల ఈ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పేరిట ఇల్లు ఇచ్చారని పిల్లలను చదివించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చారని ఎన్నికలలో కచ్చితంగా మళ్ళీ వైఎస్సార్సీపీ పార్టీని గెలుస్తుందని మాటలు చెప్పడంతో సోషల్ మీడియా వేదికగా చాలామంది గీతాంజలి పైన అసత్య ప్రచారాలను కూడా చేశారు.ఆమెను చాలా దారుణంగా ట్రోల్ చేసి మానసికంగా కూడా హింసించారు.


దీంతో టీడీపీ జనసేన చేసిన ఈ సోషల్ మీడియా మూకపు దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి మరణించినట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటన పైన హీరోయిన్ పూనమ్ కౌర్.. స్పందిస్తూ గీతాంజలి కి న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నది.. అలాగే జల్సా సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణల పైన కూడా స్పందించింది.. గీతాంజలి కి న్యాయం జరగాలి..అసలు ఆమె విషయంలో ఏం జరిగింది..ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుని పరిస్థితి ఏర్పడింది అంటూ ఒక పార్టీకి చెందిన ఆన్లైన్ ట్రోలింగ్ వల్లే ఆమె మరణించిందదా ..అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి మానసిక వేధించడం వారికి చాలా అలవాటుగా మారింది..అలాంటివారికి దయచేసి శిక్షించండి అంటూ ఆ పసిపిల్లలకు న్యాయం చేయండి అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.


సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారానే మంచి క్రేజీ సంపాదించుకున్న పూనమ్ కౌర్.. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పైన ఇమే చేసేటువంటి ట్వీట్స్ ఎప్పుడు వైరల్ గా మారుతుంటాయి. వీరిద్దరూ బాగోతాలను ఆమె ఎప్పుడూ కూడా బయట పెడుతూ ఉంటుంది అందుకే పవన్ ఫ్యాన్స్ ఈమెను చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈమె పైన ఒక పిట్ట కథను కూడా అల్లారు అదేమిటంటే జల్సా సినిమాలో అవకాశం అడిగిన ఇవ్వలేదని అందుకే వీరిద్దరిపైన ఇలా టార్గెట్ చేసిందని ప్రచారం చేయగా అవన్నీ రూమర్స్ మాత్రమే అని తాను ఇంతవరకు ఎవరిని కూడా అవకాశాలు అడగలేదని తెలిపింది.. అంతేకాదు నటన మీద ఆధారపడకుండా ఎప్పుడు జీవన మార్గాల కోసం వెతుకుతూ ఉంటానని తెలిపింది. తాను నటించిన సినిమాలలో కంటే రిజెక్ట్ చేసిన సినిమాలే ఎక్కువ అని అలాంటి రూమర్స్ నమ్మకండి అంటూ అభిమానులను కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: