ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 15.వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఉండడంతో అభిమానులు ఈ టీజర్ పై కాస్త నెగిటివ్ గా స్పందించినప్పటికీ మామూలు ప్రేక్షకులు మాత్రం చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు.

కొత్తగా ఉంది అనే ప్రశంసలను కురిపించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పాడిన నేపథ్యం లో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మొదటి పాటను విడుదల చేశారు. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. దానితో ఇప్పటికే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇలా మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యం లో రెండవ పాటను కూడా విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

జూన్ మొదటి వారంలో ఈ సినిమా.లోని రెండవ పాటను విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa