పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాక్ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడీ. కల్కి సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్‌తో నడిపే కారు(బుజ్జి)ని అభిమానులకు పరిచయం చేశారు.దీని కోసం భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రభాస్‌నే స్వయంగా బుజ్జిని డ్రైవింగ్ చేస్తూ స్టేజ్‌ పైకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.దీంతో ఎక్కడ బుజ్జి.. బుజ్జి అనే టాక్ నడుస్తోంది. ఈ బుజ్జి ఎక్కడ తయారైంది? ఎవరు తయారు చేశారు? అనే విషయాలను నెట్టింట తెగ వెతికేస్తు్న్నారు. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తాజాగా ఓ పోస్ట్ చేశారు.ప్రస్తుతం నెట్టింట బుజ్జి రచ్చ మొదలైంది. ఫ్యాన్స్ దీని వివరాల కోసం నెట్టింట జల్లెడ పడుతున్న సమయంలో దీనికి సంబంధించిన పలు విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఈ బుజ్జిని దిగ్గజ కంపెనీలు అయిన మహీంద్రా, జాయెమ్ ఆటోమోటివ్‌లు సంయుక్తంగా రూపొందిచాయి. ఈ రెండు కంపెనీలు కలిసి మనదేశంలోనే దీన్ని తయారు చేశారు. దీనికి సంబంధించి వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.కల్కి 2898ఏడీ సినిమాలోని ప్రభాస్ వాహనమైన బుజ్జి వీడియోను ఆయన షేర్ చేశారు. దాన్ని చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఉన్న తమ బృందం తయారు చేసిందని పేర్కొన్నారు. ఇది ఎలక్ట్రానిక్ మోటారును కలిగిన ఏఐ టెక్నా్లజీతో రూపొందిందని వెల్లడించారు. నాగ్ అశ్విన్‌ ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అభినందించారు. దీనికి స్పందించిని నాగ్ అశ్విన్.. అసాధ్యమైన కలలను నిజం చేసినందుకు, బుజ్జికి రెక్కలు(టెర్లు) ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఆ బుజ్జి కారు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది నెటిజన్స్ దృష్టిని మాత్రమే కాకుండా సెలబ్రిటీల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది.తాజాగా మరో స్టార్ హీరో దీనిపై మనసు పారేసుకున్నారు. దీన్ని ఎలాగైనా డ్రైవ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో బుజ్జిని కలిశారు. దూరం నుంచి చూస్తుంటే మనకే ఎలాగైనా బుజ్జి కారుని నడపాలి అని అనిపిస్తుంది. అలాంటిది అవకాశం ఉన్న సెలబ్రిటీలకి ఉండదా? అవకాశం క్రియేట్ చేసుకుని మరీ కావాల్సింది దగ్గరకు తెచ్చుకునే స్థాయి వారిది. ఈ క్రమంలో నాగ చైతన్య కూడా ప్రభాస్ బుజ్జిగాడిని కలిశారు. బుజ్జి కారుపై మనలానే ఆయన కూడా మనసు పారేసుకున్నారు. ఈ క్రమంలో బుజ్జిని కలిసి ఆ రైడ్ అనుభూతిని ఆస్వాదించారు. నాగ్ అశ్విన్ ని కలిసిన నాగ చైతన్య.. బుజ్జి కారుని డ్రైవ్ చేస్తూ ఊహల్లో విహరించారు.
అసలే నాగ చైతన్యకి కార్లంటే పిచ్చి. అందులోనూ స్పోర్ట్స్ కార్లంటే ముందు ఉంటారు. రేసింగ్ అంటే కూడా మహా ఇష్టం. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్ రేసింగ్ టీమ్ కి ఓనర్ గా కూడా ఉన్నారు. అంత పిచ్చి ఉన్న కారణంగానే ప్రభాస్ బుజ్జి కారుని డ్రైవ్ చేసేందుకు వెళ్లారు. ఫాస్ట్ గా ఆ కారుని డ్రైవ్ చేస్తూ చైతూ భలే థ్రిల్ అయ్యారు. ఆ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని వీడియో రూపంలో అభిమానులకు షేర్ చేశారు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ తో మాట్లాడుతూ.. తాను ఇంకా షాక్ లోనే ఉన్నానని.. నువ్వు ఇంజనీరింగ్ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేశావ్' అని అన్నారు. నిజమే మరి ఆ బుజ్జిని చూస్తే అసలు ఏ ఇంజనీరింగ్ రూల్ అప్లై చేయలేదని అనిపిస్తుంది. ప్రభాస్ కటౌట్ కి తగ్గా కారు అంటే ఆ మాత్రం ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: