తెలుగు సినీ ప్రేక్షకులకు రాకేష్ మాస్టర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ ను అందించింది రాకేష్ మాస్టర్ కావడం గమనార్హం. ఏకంగా శేఖర్ మాస్టర్ ను చేరదీసి తన ఇంట్లోనే పెట్టుకొని.. మరి ఇక డాన్స్ నేర్పించాడు. ఇక రాకేష్ మాస్టర్ శిష్యుడుగానే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు.


 అయితే దాదాపు 100కు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రాకేష్ మాస్టర్ ఇక సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్ఆర్కె అనే ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ఇక ఈ ఛానల్ ద్వారా తన అప్డేట్స్ ని ఎప్పుడు ఇస్తూ ఉండేవాడు. అయితే ఇక తన ఆరోగ్యం పాడవడం కారణంగా రాకేష్ మాస్టర్ ప్రాణాలు వదిలారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు రాకేష్ మాస్టర్ కొడుకు కు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది.



 రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో తన డాన్స్ పర్ఫామెన్స్ లతో అదరగొట్టేస్తూ ఉన్నాడు. గతంలో తన తండ్రి రాకేష్ మాస్టర్ ప్రారంభించిన ఎస్ ఆర్ కే ఛానల్ ను ప్రస్తుతం చరణ్ తేజ్ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇందులో తన డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు  ఈ క్రమంలోనే ఈ వీడియోలు వైరల్ గా మారగా ఇక అతని డాన్స్ చూస్తే ఫిదా అవుతున్నారు ఇంటర్నెట్ జనాలు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తేజ్ డాన్స్ పెర్ఫార్మన్స్ చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: