మాస్ మహారాజ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "మిస్టర్ బచ్చన్" అందరికీ తెలిసిందే. అయితే "మిస్టర్ బచ్చన్" కథ ఏమిటన్నది ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు. అయితే హరీష్ శంకర్ తనదైన మార్క్‌ తో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. రవితేజ కొత్త లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు, కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇక మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తుండగా మలయాళం బ్యూటీ భాగ్యశ్రీ

 ఇందులో  హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ నిత్యం వస్తున్నాయి. టీజర్, ట్రైలర్‌లు, సాంగ్స్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా  రిలీజ్  అయిన రొమాంటిక్ సాంగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి

 మేకర్స్ ఈరోజు ట్రైలర్ లాంచ్ ని ఫిక్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ట్రిపుల్ ఏ సినిమాస్ లో సాయంత్రం 5 గంటలకి మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్  షెడ్యూల్ ని ఫిక్ చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ లాంఛ్ ఈవెంట్ ఇప్పుడు నిలిచిపోయినట్టుగా ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈవెంట్ ని నిలిపివేసామని దయచేసి అభిమానులు అర్ధం చేసుకోగలరు అంటూ క్షమాపణలు చెప్పుకొచ్చారు. మరి ఈవెంట్ అయితే ఆగింది కానీ ఆన్లైన్ లో మాత్రం ఆన్ టైం సాయంత్రం 7:11 నిమిషాలకి ట్రైలర్ రావడం అయితే పక్కా అని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: