గత నాలుగైదు రోజులుగా మంచు కుటుంబ వ్యవహారం రోజుకోక  మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా నిన్నటి రోజున అర్ధరాత్రి వరకు మంచు కుటుంబం వద్ద ఒక హై డ్రామా నడిచింది.. మనోజ్ తో వచ్చిన మీడియా మిత్రుల పై మోహన్ బాబు చేయి చేసుకున్నారు. ఇందులో కొంతమంది మీడియా మిత్రులకు గాయాలయ్యాయని సమాచారం. అంతే కాకుండా మనోజ్ కి కూడా చొక్కా చిరిగేలా బౌన్సర్లు అడ్డుకోవడం జరిగిందట.. మోహన్ బాబు భార్య, మోహన్ బాబు ఇద్దరూ కూడా ఆసుపత్రి పాలైనట్లుగా సమాచారం.


అయితే ఈ రోజున మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ తనకోసం వచ్చిన మీడియా పైన తన తండ్రి చేసిన దాడి క్షమించండి అంటూ తెలియజేశారు. తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో చాలా బాధలు అనుభవించిందని ఇప్పుడు తన తండ్రి అలా ఉండేవారు కాదని.. మా నాన్న తనకు దేవుడని కానీ ఈరోజు కనిపిస్తున్న తన తండ్రి మా నాన్న కాదు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకున్నారు.. తాను ఎప్పుడూ కూడా ఎవరి ఆస్తులు అడగడం లేదని తన వ్యక్తిగత జీవితం గురించి తన తండ్రికి ఎవరో అపార్థంగా చెప్పారని.. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తన తండ్రికి తనకు విభేదాలు సృష్టించారని తెలిపారు.


ఈ విషయంలో తన భార్య ఏడు నెలల కూతురు పేరును లాగుతున్నారు..తాను సొంతంగా నిలబడడానికే ప్రయత్నాలు చేస్తున్నానని మీడియా పైన దాడి చేయడం చాలా బాధ కలిగిస్తోందని అందుకు క్షమాపణలు కూడా తెలియజేస్తున్నానని తెలిపారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని విషయాలు బయటపెడతానంటూ బాగోద్వేగానికి గురయ్యారు మనోజ్. తన కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలను చెబుతూ తనకు ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ తెలియజేశారు మనోజ్..

మరింత సమాచారం తెలుసుకోండి: