ఇక ఆ ఇద్దరూ ఎవరో అందరికీ అర్థమయిపోయి ఉంటుంది .. ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు .. మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. 2024 మొదట్లో గుంటూరు కారం తో ప్రేక్షకులను పలకరించాడు మహేష్. అలాగే డిసెంబర్లో పుష్ప 2 అంటూ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్నాడు అల్లు అర్జున్ .. ఇక మహేష్ బాబు తన తర్వాత సినిమాని రాజమౌళితో చేయబోతున్నాడు .. 2025 జూన్ లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది .. ఈ లెక్కన 2027 వరకు మహేష్ సినిమా వచ్చే అవకాశం లేదు.
ఇక అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది కూడా సమ్మర్ తర్వాతే .. పైగా అది VfX తో కూడిన మైథిలాజికల్ ప్రాజెక్ట్ .. 16 నెలలు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ .. ఈ లెక్కన త్రివిక్రమ్ 2026 లో అయిన బన్నీ సినిమా వస్తుందా లేదా అనేది కూడా అనుమానమే .. ఇలా మొత్తానికి 2025 లో అసలు కనిపించరు .. ఇక 2026 లో బన్నీ , మహేష్ లో ఎవరి ఈ సినిమా విడుదలైన అభిమానులకు అది పెద్ద పండుగ లెక్క.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి