అయితే ఇప్పుడు ఒక్కసారిగా టాలీవుడ్ లో ఉన్న రెండు మూడు పెద్ద నిర్మాణ సంస్థల మీద .. అలాగే పలు మీడియా సంస్థల మీద కూడా ఐటి దాడులు ఒకేసారి జరగటం , ఇప్పుడు ఇదంతా కొంత ఆశ్చర్యంగా ఉంది .. మైత్రి మూవీస్ అంటే చిన్న సంస్థ కాదు .. అలాగే ఈ సంస్థ వెనక చాలా అంటే చాలామంది ఎన్నారైల పెట్టుబడులు, రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్నాయని వార్తలు కూడా వస్తూ ఉంటాయి .. అదేవిధంగా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో పలు రాజకీయ నాయకులు పెట్టుబడులు కూడా ఉన్నాయి .. అంతేకాకుండా ఇంకా చాలా సంస్థలతో ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతున్నాయి.
అయితే ఇవన్నీ ఎలాంటి ఇల్లీగల్ లావాదేవీలు మాత్రం కావు .. అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్లే జరుగుతున్నాయి .. అయితే ఇప్పుడు అసలు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి ఇవన్నీ పడినట్టు తెలుస్తుంది. . అభిషేక్ అగర్వాల్ సంస్థ మీద కూడా గతంలో దాడులు జరిగాయి .. వాస్తవానికి ఈ సంస్థ గొప్ప అద్భుతమైన లాభాలు అయితే తెచ్చుకోలేదు .. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో భారీగా నష్టపోయింది .. అలాగే కాశ్మీర్ ఫైల్స్ సినిమా చేసిం ది.. అలాగే మరో హిందీ సినిమా చేస్తుంది తప్ప ఈ బ్యానర్ నుంచి అంత గొప్ప సినిమాలు ఏమీ లేవు.
అయితే ఆ సంస్థకు మైత్రి వారితో కొన్ని లావాదేవీలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు దాని మీదకు వచ్చారని కూడా అంటున్నారు .. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే ఈ సంస్థకు పీపుల్ మీడియాతో కూడా కొన్ని అపరిమిత లావాదేవీలు జరుగుతున్నాయని టాక్ .. ఇక ఇప్పుడు ఐటీ అధికారులు క్రాస్ వెరిఫికేషన్ అంటూ అటు కూడా వెళ్తారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే నిర్మాత దిల్ రాజు సంస్థ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది .. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఐటీ సోదాలు ఊహించిన విధంగా ఐటీ సోదాలు ఆయన మీద ఎందుకు పడ్డాయి అన్నది మరో అనుమానం .. రీసెంట్గా దిల్ రాజు కూడా విదేశాల్లో ఉన్న మన వారి నుంచి ఫండ్స్ సేకరించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే మైత్రి సంస్థకు విదేశీ నిధులకు సంబంధం ఉంది, అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ లింకు ఉంది .. ఇక ఇప్పుడు తాజాగా విదేశీ పెట్టుబడిల కోసం దిల్ రాజు ప్రయత్నించారు .. మ్యాంగో రామ్ సంస్థ ఏకంగా విదేశాలలోనే తన సంస్థని రిజిస్టర్ చేయించుకున్నాడు .. అయితే ఇక్కడ ఒక అభిషేక్ అగర్వాల్ లింకును పక్కకు తప్పిస్తే మిగిలినవన్నీ విదేశీ నిధుల లింకు ఉన్న కంపెనీలే. దీని కారణంగా ఈ దాడులు ఆ దిశగా మరలుతున్నాయి .. అలాగే ఈ సోదాలు చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు .. అలాగే దర్శకుడు సుకుమార్ ఎప్పుడు దుబాయ్ నుంచి వస్తారు అన్నది కరెక్ట్ గా టైం చూసుకుని మరీ రంగంలోకి దిగారు .. అలాగే మ్యాంగోరామ్ ముంబైలో ఉన్న సంగతి తెలుసుకొని ఐటీ దాడులు మొదలయ్యాయి. అదే విధంగా ఫైనాన్షియర్ ఎన్టీఆర్ అభిమాని ప్రతాపరెడ్డి ఇంటి మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి .. ఇతని గురించి అసలు ఎవరికీ పెద్దగా పరిచయం కూడా ఉండదు .. లాంటిది ఐటి అధికారులకు ఎలా తెలిసింది. అలాగే ఈ మొత్తం వ్యవహారం మరో రెండు రోజులపాటు జరుగుతుంది .. ఈ వ్యవహారంలో ఇంకెన్ని పేర్లు బయటికి వస్తాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి