లావణ్య త్రిపాఠి.. ఈ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికీ ముందు మెగా అన్న పేరే కనిపిస్తుంది. ఒకప్పుడు లావణ్య త్రిపాఠి పేరు చెప్తే ఒక హీరోయిన్ అంటూ సైలెంట్ గా కొట్టి పడేసేవారు . పెద్దగా తోపైన సినిమాల్లో కూడా నటించలేదు . హీరోయిన్ అంతే. బాగుంటుంది ..చక్కగా మాట్లాడుతుంది .. అందంగా నటిస్తుంది .. ఇంతవరకే ఆమె గురించి తెలుసుకునే వాళ్ళు . ఎప్పుడైతే వరుణ్ తేజ్ తో ప్రేమ - పెళ్లి అంటూ వార్తలు వినిపించాయో అప్పటినుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది .


లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత ఆమె లైఫ్ టోటల్ మారిపోయింది. లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటికి కోడలు గారు రాజ్యమేలేస్తుంది. ఇండస్ట్రీలో బడా బడా సినిమాల్లో అవకాశాలు వస్తున్నా సరే మెగా పరువుని ఎక్కడ తగ్గనీకుండా ఉండే సినిమాలనే చూస్ చేసుకోవడానికి .. దాని కోసం వెయిట్ చేస్తుంది . ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి అంటూ వెయిట్ చేస్తుంది . అయితే గతంలో లావణ్య త్రిపాఠి ఎన్నో మంచి మంచి సినిమా అవకాశాలను మిస్ చేసుకున్నింది అన్న వార్త మరొకసారి ట్రెండ్ అవుతుంది.



ఆ లిస్టులో నాగచైతన్య - రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది . జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన "జనతా గ్యారేజ్". ఈ సినిమాలో లావణ్య త్రిపాఠినే హీరోయిన్గా అనుకున్నారట . కానీ ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.  కథ నచ్చకపోవడంతోనే ఆమె ఈ ఆఫర్ రిజెక్ట్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి.  ఈ సినిమాలో నిత్యమీనన్ పాత్ర కోసం ముందుగా లావణ్య త్రిపాఠిందే అనుకున్నారట . కానీ ఆమెకి ఈ పాత్ర పెద్దగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట . అలా లావణ్య - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయినట్లు అయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: