టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే .. ఆమె 35 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల‌లో న‌టించి ఎంతో మంచి క్రేజ్ అందుకుంది. ఆ త‌ర్వాత ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ త‌ర్వాత న‌గ‌రి నుంచి రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డంతో పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ర్యాట‌క శాఖా మంత్రి గా కూడా కొన‌సాగారు. ఇక రోజా తెలుగు అమ్మాయి అయినా త‌మిళంలో బాగా పాపుల‌ర్ .. ఆ త‌ర్వాత ఆమె కన్నడ మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు గెలుచుకున్నారు.


అయితే రోజా ఒకే ఒక్క బాలీవుడ్ సినిమాలో న‌టించారు. ఈ విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ప్రేమ త‌ప‌స్సు సినిమాతో సినిమాల్లోకి వ‌చ్చిన రోజా వినోద్ కుమార్ హీరోగా వ‌చ్చిన సీతార‌త్నం గార‌బ్బాయి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు. ఇక భైర‌వ‌ద్వీపం సినిమాతో కూడా ఆమెకు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత త‌మిళ ద‌ర్శ‌కుడు ఆర్ కె. సెల్వమణిని వివాహం చేసుకుంది. రోజా నటించిన హిందీ సినిమా  మహేష్ భట్ డైరెక్షన్లో వచ్చిన ది జెంటిల్మెన్ . అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులో వ‌చ్చిన జంటిల్మెన్ సినిమాకు బాలీవుడ్‌లో రీమేక్‌గా తెర‌కెక్కింది. అయితే అంచ‌నాలు అందుకోలేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: