పవన్ కళ్యాణ్ .. ఏదైనా సరే ఒకసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినడు.. అది తప్పైనా ఒప్పైన.. ఆయన తీసుకున్న డెసీషన్స్ కి ఆయనే కట్టుబడి ఉంటారు.  అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసారట.  కానీ నాలుగోసారి ఆ సినిమాను ఫైనలైజ్ చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.


ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా ..? అందరికి ఎంతో ఫేవరేట్ గా నిలిచిన "వకీల్ సాబ్".  ఎస్ లేడీస్ కి ఎంతో ఉపయోగపడే విధంగా తెరకెక్కించిన ఈ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ ఎవరు రీప్లేస్ చేయలేనిది . పవన్ కళ్యాణ్ కోట్ వేసుకొని న్యాయవాదిలా తెరపై కనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉండింది. ఎన్ని సార్లు చూసిన ఆ సీన్స్ తనివి తీరవు.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసేసారు అభిమానులు . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ వేరే లెవల్ అని చెప్పుకోవాలి .



కాగా  ఇప్పటికీ ఈ సినిమాను బాగా లైక్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు . ఈ సినిమాను ఆయన ఏకంగా మూడుసార్లు నో అంటు రిజెక్ట్ చేశారట . అప్పటికే పొలిటికల్ పరంగా కొంచెం బిజీగా ఉండడంతో వద్దులే అంటూ రిజెక్ట్ చేసారట . కానీ ఈ రోల్ కి ఆయన తప్పితే మరెవరు సూట్ అవ్వరు అంటూ డైరెక్టర్ పదే పదే రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్లీ ఆయన ఈ రోల్ ని ఓకే చేసి సినిమాను కంప్లీట్ చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీయర్ కి ఎప్పుడు స్పెషల్ గానే ఉంటుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: