బాలకృష్ణ అఖండ సీక్వెల్ల్ విషయం లో ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు చిత్ర యూనిట్ .. మొదటి భాగం  అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవటం తో సిక్వెల్ మీద కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి .. ఇక అంచనాలకు తగ్గట్టు గానే వాటిని అందుకునే రేంజ్ లోనే సినిమాలు తీర్చిదిద్దుతున్నారు .. ఇక తాజా గా ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన అప్డేట్ నందమూరి అభిమానులకు మరింత ఆనందాన్ని జోష్ ను నింపుతుంది ..


ఇక అఖండ సినిమా సూపర్ హిట్ అవటం తో వెంటనే సీక్వెల్ ను ప్రకటించారు .. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్లోనే బిజీ గా ఉన్నారు నట‌సింహం బాలయ్య .. ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉండడం తో మేకింగ్ విషయం లో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటుంది చిత్ర యూనిట్ .. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు కుంభమేళా , హిమాలయాల్లో ప‌లు కీల‌క‌ సన్నివేశాల షూటింగ్‌ ను పూర్తి చేశారు .. ఇక త్వరలో నే జార్జియా లో మరో కొత్త షెడ్యూల్‌ ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్‌ .. అక్కడ కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెర్కక్కించబోతున్నారు ..


 ఇక‌ ఈ సినిమా లో కీలకమైన భాగం యాక్షన్ బ్లాక్ కావడం తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను తీసుకురాబోతున్నారు .. బాలయ్య కెరీర్ లోనే వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావటం తో కూడా ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి .. వచ్చే దసరా కానుకగా అఖండ 2 ను రిలీజ్ చేయాలనుకున్న .. షూటింగ్ ఆలస్యం అయ్యేలా ఉండటం తో డిసెంబర్ లేదా జనవరి లో రిలీజ్ కు ప్లాన్ చేయాలని చూస్తున్నారు . అలానే వీలైనంత త్వర గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారు బాలయ్య .

మరింత సమాచారం తెలుసుకోండి: