
అలాగే ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపింది. తను గతంలో పడిన కష్టమే నేడు తనకు ఇంతమంది అభిమానులను తీసుకొచ్చి పెట్టిందని చెప్పుకొచ్చింది. తెలిసి తెలియక చాలా నిర్ణయాలు తీసుకుంటామని.. అవి మన కెరీర్ పై ప్రభావం చూపుతాయని సామ్ తన అభిమానులకు తెలిపింది. జీవితం పట్ల తీసుకునే ఏ నిర్ణయం అయిన బాగా ఆలోచించి తీసుకోవాలని సమంతా చెప్పుకొచ్చింది.
ఇకపోతే సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంతా రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సామ్ అంటే ఇష్టపడని వారుండారు. ఈ అందాల భామ గతంలో ఆరోగ్యం బాగలేక సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సమంతా మళ్లీ సినిమాలలో కనిపిస్తుంది. ప్రస్తుతం సమంత సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.