నాగచైతన్య ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగార్జున వారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే యూత్ ను తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ సినిమా అనంతరం నాగచైతన్య వరుసగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక నాగ చైతన్య తన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అవన్నీ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. 

రీసెంట్ గా ఈ హీరో నటించిన తండెల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో నాగచైతన్య భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్ లో అత్యంత వేగంగా ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ చిత్రం నిలవడం విశేషం. ఈ సినిమా అనంతరం నాగచైతన్య మరో సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైందట. కాగా, ఆ సినిమా ట్రేజర్ హంటింగ్ నేపథ్యంలో మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని స్వయంగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అంతేకాకుండా తన కెరీర్ లో ఇది భారీ చిత్రమని నాగచైతన్య చెప్పారు. సినిమా టైటిల్ ను "వృష కర్మ" గా ఫిక్స్ చేసినట్లుగా నాగచైతన్య ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం నాగచైతన్య చెప్పలేదు. ప్రస్తుతం నాగ చైతన్య షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇక నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారట. తాను నటించే సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవాలని నాగ చైతన్య అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: