సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ మాట్లాడుకునే మాటలు ఎంత ఫన్నీగా ఉంటాయో దానిని మీమ్స్ అంతే ఫన్నీగా ట్రెండ్ చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు.  మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . అంతేకాదు నాగచైతన్య ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం శోభిత ధూళిపాళ్లకి అంటగట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నాగచైతన్య ఇంత పెద్ద హిట్అందుకోవడానికి కారణం ఆయన కొత్త భార్య శోభిత ధూళిపాళ అని ట్రెండ్ చేస్తున్నారు.


ఆమె నాగ చైతన్య లైఫ్ లోకి వచ్చింది అని ఆ కారణంగానే ఆయన జాతకం మారింది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  రీసెంట్గా "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు . నాగచైతన్య కొన్నాళ్లుగా హిట్స్ లేక సతమతమవుతున్న సంగతి అందరికి తెలిసిందే. నాగచైతన్యకు తండేల్ సినిమా మంచి కం బ్యాక్ అనిపించింది. అయితే ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా నాగ చైతన్య అభిమానులకు పండగ చేసుకునేలా చేసింది .



ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు నాగ చైతన్య. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు . ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది . కచ్చితంగా ఈ సినిమాతో మరొక వంద కోట్లు తన ఖాతాలో వేసుకుంటాడు అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల కారణంగానే బ్యాక్ టు బ్యాక్ ఇలా మంచి మంచి సినిమాలు నాగచైతన్య ఖాతాలో పడుతున్నాయి అంటున్నారు జనాలు . కొంతమంది శోభితా ధూళిపాళ్ల అక్కినేని ఫ్యామిలీకి మంచి లక్ ని తీసుకొచ్చింది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . అయితే రియల్ నాగచైతన్య ఫ్యాన్స్ మాత్రం ఇక ఆపండ్రా సొల్లు .. నాగచైతన్య కష్టం ఇదంతా ఎవరో వస్తే నో ఎవరో చెప్తే నో లక్ వస్తుందా..? ఆయన కష్టం ఆయన టాలెంట్ ఇప్పటికీ వర్కౌట్ అయింది ..ఇది పూర్తిగా నాగచైతన్య పడిన కష్టమే .. ఎవరో లక్ కానే కాదు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య -శోభిత ధూళిపాల పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: