
మరీ ముఖ్యంగా అనిమల్ సినిమా తర్వాత ఓ ప్రముఖ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డివంగా తన మనసులోని విషయాలన్నీ ఓపెన్ అప్ అవుతూ బయటపెట్టేసాడు. అసలు ఆయన సినిమా కాన్సెప్ట్ ఏ విధంగా అనుకున్నాడు ..?ఎలా కొన్ని కొన్ని సీన్స్ ని చిత్రీకరించారు ..? అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు . ఇదే మూమెంట్లో అసలు అనిమల్ సినిమాకు రష్మిక మందన్నా లాంటి హీరోయిన్ ఎలా సూట్ అవుతుంది అనుకున్నారు ..? అన్న ప్రశ్నకు జవాబు ఇస్తూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఇదే మూమెంట్ లో డియర్ కామ్రేడ్ సినిమా గురించి ఓ విషయాన్ని బయట పెట్టారు. "విజయ్ దేవరకొండ - రష్మిక ల మధ్య కొన్ని కొన్ని సీన్స్ చూసినప్పుడు నాకు రష్మిక నేను అనుకున్న సీన్స్ చేయగలదు అన్న నమ్మకం కలిగింది అంటూ బయట పెట్టారు . అంతేకాదు కళ్ళతో ఆ హావ భావాలను చక్కగా పలికించే సత్తా ఉంది రష్మిక మందన్నా అని ఆ సినిమా ద్వారానే ఆయన అనుకున్నారట ". ఆయన అనుకున్నట్ల రష్మిక అనిమల్ సినిమాలో నటించలేదు జీవించేసింది . ఒక్కొక్క సీను ఒక్కొక్క ఆణిముత్యంలా నటించింది అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డివంగా . అలా రష్మిక అప్పటివరకు తన కెరియర్ లో నటన పరంగా ఒక్కటంటే ఒక్క కామెంట్ దక్కించుకోలేకపోయింది . అనిమల్ సినిమాకి మాత్రం ఆమె చాలా పాజిటివ్ రివ్యూల అందుకుంది. ఎట్ ద సేమ్ టైం బూతు కామెంట్స్ కూడా దక్కించుకున్నింది..!