శ్రీ విష్ణు పై మంచు విష్ణు కేసు పెట్టబోతున్నారా.. ఇంతకీ శ్రీ విష్ణు చేసిన తప్పేంటి.. ఎందుకు మంచు విష్ణు శ్రీ విష్ణు పై కేసు పెట్టబోతున్నారు.. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.మంచు ఫ్యామిలీ అంటేనే ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే ఫ్యామిలీ.. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా ఫ్యామిలీ ఎక్కువగా ట్రోలింగ్ కి గురైంది అంటే అందులో ముందు లిస్టులో ఉండే పేరు మంచు ఫ్యామిలీది మాత్రమే. ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో మంచు ఫ్యామిలీ ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది.ఇక ఈ ఫ్యామిలీలో వివాదాలకు కొదువే లేదు. అన్నదమ్ముల మధ్య,తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్పని భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు జూన్ లో విడుదలకు సిద్ధమయింది. 

ఇక ఈ సినిమా కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ అన్నింట్లో ఏదో ఒక విషయంలో మంచు విష్ణు ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నాడు.ముఖ్యంగా శివయ్యా అనే పదం కన్నప్ప మూవీ లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ పదాన్ని కూడా సోషల్ మీడియా జనాలు ట్రోలింగ్ కి గురి చేశారు.అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా నటుడు శ్రీ విష్ణు సింగిల్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణు మంచు కురిసిపోతుంది, శివయ్యా అనే రెండు పదాలను వాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే పదే పదే కన్నప్ప మూవీ లో శివయ్యా అనే పదం వస్తుంది కాబట్టి ఈ పదాన్ని తన సినిమాలో ఒక కామెడీ పదంగా శ్రీ విష్ణు ఉపయోగించినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక బూతు పదానికి మంచు కురిసిపోతుంది అని వాడుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ రెండు పదాలు కూడా మంచు విష్ణుకి అస్సలు నచ్చలేదని, ఒకటి తన సినిమాలో ఉన్న శివయ్యా అనే పదాన్ని ట్రోలింగ్ చేయడం అని,మరొకటి మంచు కురిసిపోవడం అనే పదాన్ని బూతు పదం ప్లేసులో వాడి తన ఇంటి పేరుని అవమానించారని మంచు విష్ణు సింగిల్ మూవీ యూనిట్ పై,శ్రీ విష్ణు పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇవి రెండు పదాలు ఉపయోగించి తన ఫ్యామిలీని తన సినిమాని అవమానించారు అని మంచు విష్ణు కేసు పెట్టడమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీకి ఫిర్యాదు కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రూమర్ ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు ఒకవేళ ఫిర్యాదు చేస్తే మాత్రం మంచు విష్ణు మళ్ళీ ట్రోలింగ్ బారిన పడటం ఖాయం. ఎందుకంటే సినిమాని సినిమా లాగా తీసుకోవాలి.సినిమా పడే ముందే సినిమాలోని పాత్రలు,సన్నివేశాలు, డైలాగులు అన్ని కల్పితం అని వేస్తూ ఉంటారు. ఇన్ని సినిమాల్లో నటించావు ఇది మీకు తెలియదా అని మంచు విష్ణు మళ్ళీ విమర్శల పాలవుతారు అంటూ నెటిజన్లు  కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: