గత ఏడాది పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో  భాగంగా అటు చిత్ర బృందంతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా బాధితుడు శ్రీ తేజ సుమారుగా కొన్ని నెలలపాటు ఐసీయూలోని చికిత్స పొందుతూ ఉన్నారు. శ్రీ తేజ తల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అక్కడిక్కడే మరణించడంతో ఈ విషయం తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో భాగంగా అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చారు.


గత కొద్ది రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ.. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారట. ఈ ఘటనలో శ్రీ తేజ తల్లి రేవతి కూడా మృతి చెందింది. కిమ్స్ ఆస్పత్రిలో గత ఐదు నెలలుగా శ్రీ తేజ చికిత్స పొందుతూ ఉన్నారు. మొదట్లో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించినప్పటికీ ఆక్సిజన్ సరఫరా  లేకపోవడంతో మెదడులో కొంతమేరకు నష్టం జరిగినట్లుగా వైద్యులు గుర్తించడం జరిగింది. కానీ డిసెంబర్ 24 గత ఏడాది శ్రీ తేజ వెంటిలేటర్ లేకుండానే స్వయంగా శ్వాస తీసుకున్నట్లుగా తెలియజేశారు.అలా నెమ్మదిగా కోలుకుంటూ కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేదట.


ప్రస్తుతం శ్రీ తేజ ఆసుపత్రి నుంచి మరొక సెంటర్ కి తరలించారు.ఆ తర్వాత శ్రీ తేజకు ఫిజియోథెరపీ వంటివి చేయించారట. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని నెలలు సమయం పడుతుందని వైద్యులు  తెలియజేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ తేజ గొట్టం ద్వారా ద్రవ ఆహారాన్ని అయితే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నో నెలల తర్వాత శ్రీ తేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో కొంతమేరకు ఇది అల్లు అర్జున్ కు ఊరట కలిగించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: