కొంతమంది హీరోయిన్లు సినిమాలో రాణిస్తున్న సమయంలో వారికి ఏదైనా అనుకోని పరిణామాలు ఎదురైతే కొంతమంది వాటిని ఎదుర్కొని సినిమాల్లో రాణిస్తారు. మరి కొంత మంది ఆదిలోనే భయపడిపోయి సినిమాలు మానేస్తారు. ఈ విషయం పక్కన పెడితే ఓ హీరోయిన్హీరో దెబ్బకి భయపడి చివరికి సినిమాలే వదిలేసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే రచనా బెనర్జీ.ప్రస్తుతం లోక్ సభ సభ్యురాలిగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్న రచనా బెనర్జీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనే సంగతి మనకు తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ, చిరంజీవి,శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, మోహన్ బాబు, ఉపేంద్ర వంటి ఎంతో మంది హీరోలతో కలిసి నటించింది. అయితే అలాంటి ఈ హీరోయిన్హీరో ప్రవర్తన కారణంగా  దాదాపు 25 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది అంటూ ఒక రూమర్ వినిపిస్తోంది. 

అయితే ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రచనా బెనర్జీ మాట్లాడుతూ.. నేను తెలుగులో ఎంతోమంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను.ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలు పేరుకే పెద్ద హీరోలు. కానీ వారు సెట్ లో అందరితో కలిసిమెలిసి చాలా హ్యాపీగా మాట్లాడతారు. అంత పెద్ద హీరోలు అలా సింపుల్ గా ఉండడం చూసి నేను షాక్ అయ్యాను. అయితే బాలకృష్ణకు మాత్రం చాలా ఆగ్రహం ఉంటుంది.ఆయన ఏ విషయానికైనా సరే చాలా తొందరగా కోపం తెచ్చుకుంటారు. అయితే మొదట షూటింగ్  సెట్లో బాలకృష్ణ గారి ఆగ్రహం చూసి నేను చాలా భయపడిపోయారు. ఆయన ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని వణికి పోయాను.

అయితే బాలకృష్ణతో అదే మొదటి సినిమా కాబట్టి మొదట్లో చాలా భయమేసింది అంటూ అప్పటి అనుభవాలను రచనా బెనర్జీ పంచుకుంది.అయితే లాహిరి లాహిరి లాహిరిలో మూవీ తర్వాత రచనా బెనర్జీ మళ్ళీ తెలుగులో నటించలేదు. పాతిక సంవత్సరాలైనా కూడా మళ్లీ టాలీవుడ్ లో నటించకపోవడానికి కారణం బాలకృష్ణకు భయపడే ఆమె ఇండస్ట్రీ వదిలేసింది అనే రూమర్ వైరల్ అయింది. కానీ అలాంటిది ఏమీ లేదు అని తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నాయని మంచి పాత్ర వస్తే మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తాను అంటూ రచనా బెనర్జీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: