
ఈ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో వచ్చిన సినిమాలకు టాక్ బాగున్న దానికి తగ్గ ఆదరణ మాత్రం సరిగా కనిపించడం లేదు .. కొన్ని సినిమాల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది . ఇక దీంతో పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదని .. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను కారణాలుగా మాట్లాడుతూ వస్తున్నారు .. అయితే ఆడియన్స్ థియేటర్లకు వస్తేనే సినిమాలు విజయం సాధిస్తాయని కూడా వారు చెబుతున్నారు .. అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశంపై నేచురల్ స్టార్ నాని కూడా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు .. హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా నాని తెలుగు మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆడియోస్ థియేటర్లకు రావటం లేదు అనేది తప్పు అవాస్తమని . ప్రేక్షకుల్ని థియేటర్లకి వచ్చేలా మనమే సినిమాల ద్వారా ప్రమోషన్స్ చేసి వారిని ప్రేరేపించాలని నాని చెప్పుకొచ్చారు ..
ఒక సినిమాకు మంచి క్రేజ్ వస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లో దాన్ని చూసి ఆదరిస్తారని కూడా నాని చెప్పకు వచ్చారు .. అయితే ఇప్పుడు నాని చేసిన ఈ కామెంట్స్ తో ఎంతమంది ఏకీభవిస్తారు అనేది కూడా చెప్పలేం .. నాని హీరోగా నటించిన హిట్ 3 మూవీ ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది .. ఇప్పటికే ఓవర్సీస్ లో మొదటి షోని కంప్లీట్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో నడుస్తుంది . రిలీజ్ కి ముందే ఈ సినిమా భారీ హైప్ ను తెచ్చుకుని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది .. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందనే కామెంట్లు కూడా వస్తున్నాయి .. అలాగే నాని కూడా తన గత సినిమాలుకు భిన్నంగా ఎంతో వైల్డ్ యాక్షన్ గా కనిపించాడని కూడా అంటున్నారు .. ఈ సినిమాతో నాని లోని కొత్త యాంగిల్ ప్రేక్షకులకు పరిచయమైందని కూడా సినిమా చూసినవారు చెబుతున్నారు . ఇక బాక్సాఫీస్ వద్ద హిట్ 3 ఎలాంటి కలెక్షన్లు రాబడుతుంది అనేది తెలియాలి ..