
అయితే విజువల్స్ చూసి మరో రంగస్థలం రేంజ్ లో ఈ సినిమా కనిపిస్తుందని టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది .. అయితే పెద్ది మరింత లెవెల్ లో రీచ్ అయ్యేలా ఉందని ఇప్పుడు చెప్పాలి .. తాజాగా ఓ షెడ్యూల్ లండన్ లో కూడా ఉందని ఇప్పుడు తెలిసింది అంటే పెద్ది మ్యానియా కేవలం లోకల్ నుంచే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుంది అని కూడా చెప్పవచ్చు .. అలాగే ఈ సినిమాలో ఇలాంటి మూమెంట్స్ డెఫినెట్గా ప్రేక్షకులకు మంచి హైప్ ని కూడా ఇస్తాయి .. ఇక దీంతో దర్శకుడు బుచ్చిబాబు ప్లానింగ్ మరి అతని విజన్ ఏ రేంజ్ లో ఉందో అనేది కూడా అంత అర్థం చేసుకోవచ్చు ..
ఇక ఈ సినిమాని కూడా 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల షూటింగ్ పూర్తి అవ్వగా .. త్వరలోనే మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది . అలాగే ఈ సినిమా పై రామ్ చరణ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . రాజమౌళితో సినిమా చేసిన మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి . ఎన్నో ఆశలతో చేసిన గేమ్ చేంజర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగలడంతో .. చరణ్ బుచ్చిబాబు పెద్ది మూవీ పై భారీ అసలు పెట్టుకున్నాడు ..