కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఆజిత్ కుమార్ ఒకరు. ఇప్పటివరకు అజిత్ కుమార్ ఎన్నో తమిళ సినిమాలలో నటించాడు. అందులో చాలా మూవీలు మంచి విజయాలను కూడా అందుతున్నాయి. దానితో ఈయన ఇప్పటికి కూడా తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అజిత్ కుమార్ నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి సక్సెస్ లను అందుకున్నాయి. దానితో అజిత్ కుమార్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇకపోతే కొంత కాలం క్రితం అజిత్ కుమార్ విడ ముయార్చి తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష , అజిత్ కుమార్ కు జోడిగా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు తమిళ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమాకి మంచి కలెక్షన్లు దక్కలేదు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఎన్ని ..? ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ బిజినెస్ వివరాలను , ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన నష్టాల గురించి తెలుసుకుందాం.

మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1.02 కోట్ల షేర్ ... 2.0 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.70 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 3 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1.98 కోట్ల నష్టాలను అందుకొని తెలుగు రాష్ట్రాల్లో భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak