
కానీ కుదరలేదు. ఆయన మరెవరో కాదు "శ్రీకాంత్ అడ్డాల" . ఆ సినిమా మరేంటో కాదు "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే . ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటిగా అందరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి మాట్లాడుకుంటారు. అంతలా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది . ఈ సినిమాలో వెంకటేష్ పెద్దోడి క్యారెక్టర్ లో చిన్నోడి క్యారెక్టర్ లో మహేష్ బాబు నటించి మెప్పించారు.
కాగా చిన్నోడి క్యారెక్టర్ లో మహేష్ బాబు కన్నా ముందు చాలామంది హీరోస్ ని అనుకున్నారట డైరెక్టర్. కోలీవుడ్ హీరో సూర్య ..ఆ తరువాత హీరో కార్తీ అదే విధంగా ప్రభాస్ ని కూడా అనుకున్నారట . కానీ ప్రభాస్ మాత్రం ఈ క్యారెక్టర్ తనకి సూట్ కాదులే అంటూ చాలాసార్లు వద్దు వద్దు అని రిజెక్ట్ చేశారట . డైరెక్టర్ ఎంత ఫోర్స్ చేసినా ఈ పాత్ర చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదట . ఆ తర్వాత మహేష్ బాబు వద్దకు ఈ రోల్ వెళ్ళింది. పెద్దోడి క్యారెక్టర్ లో వెంకటేష్ చిన్నోడి క్యారెక్టర్ లో మహేష్ బాబు ఇరగదీశారు అని చెప్పాలి..!