టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు అనగానే అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గుర్తొస్తాడు . ఆయన డైరెక్షన్ తో కాదు ఆయన డైలాగ్ రైటింగ్ లతోనే మనసును కట్టిపడేస్తూ ఉంటారు . ఎవరికి ఎలా ఇవ్వాలి ..? ఎవరికి ఎలా ఇచ్చి పడేయాలి..? ఏ టైమింగ్ లో ఎలాంటి డైలాగ్స్ రాయాలి .. అనేదానికి బాగా అర్హుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు "గుంటూరు కారం" సినిమా  తర్వాత చాలా చాలా హ్యూజ్ ట్రోళ్లింగ్  ఎదుర్కొన్నాడు . అసలు మాటల మాంత్రికుడికి ఇక సినిమా ఇండస్ట్రీలో లైఫ్ లేదు అనే రేంజ్ లోనే జనాలు ట్రోల్ చేశారు .
 

కానీ ఎవరు  ఊహించిన విధంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇచ్చి  త్రివిక్రమ్ పేరు నెట్టింట ట్రెండ్ అయ్యేలా మార్చేశారు . కానీ మళ్ళీ ఆ సినిమా హోల్డ్ లో పడ్డింది. పుష్పలాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అట్లీ డైరెక్షన్లో సినిమాకి కమిట్ అయ్యాడు అని..  దీంతో త్రివిక్రమ్ ఖాతాలో నుంచి బిగ్ సినిమా హోల్డ్ లో పడినట్టు అయ్యింది.  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా వస్తుంది కానీ ఎప్పుడొస్తుందో చెప్పలేము.  ఎందుకంటే అది వాళ్ళకి కూడా తెలియదు .



అయితే అదే మూమెంట్లో రామ్ పోతినేని తో ఒక లవబుల్ లవ్ స్టోరీ కి  త్రివిక్రమ్ కమిట్ అయ్యి కాల్ షీట్స్ తీసుకున్నాడని ఓ న్యూస్ తెర పై కి వచ్చింది.   అయితే రీసెంట్ గా రామ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అంటూ తెలుస్తుంది.  దానికి కారణం ఈ సినిమాలో హైలెట్ పాత్ర రామ్ ది  కాదు అని వెంకటేష్ ది అని.. ఈయనది ఒక సెకండ్ హీరో పాత్ర మాదిరిగానే ఉంటుంది అని.. ఆ విషయం తెలుసుకున్న రాంపోతినేని ఈ సినిమా నుంచి తప్పుకున్నారట . దీంతో గురూజీకి మరొక హీరో ని సెట్ చేసే పరిస్థితి వచ్చింది .  రామ్ పోతినేని ..త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో ఈ సినిమా ని క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత చిన్నగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ జనాలు రామ్ పోతినేనికి  సపోర్ట్ చేస్తున్నారు . త్రివిక్రమ్ మొదటి నుంచి కూడా స్టార్ హీరోలకి లీడ్ క్యారెక్టర్లు ఇస్తారు అని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: