
అయితే రాజమౌళి ఒక్క అడుగు ముందుకు వేసి బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్.. చరణ్ - ఎన్టీఆర్ లతో సినిమా తెరకెక్కించి సభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ మల్టీ స్టారర్ మూవీ రానే రాలేదు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ - తారక్ కాంబోలో ఓ సినిమా రావాల్సి వుండింది అని .. కానీ ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు అని ఫ్లిం ఇండస్ట్రీలో ఉండే జనాలు మాట్లాడుకునేవారు.
ఆ సినిమా మరేంటో కాదు "బాద్షా". ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ . కాజల్ - ఎన్టీఆర్ మధ్య వచ్చే డైలాగ్స్ హైలెట్గా మారాయి . అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్ధ్ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు . నిజానికి స్పెషల్ క్యారెక్టర్ కోసం రెబల్ హీరో ప్రభాస్ ని అనుకున్నారట డైరెక్టర్. కానీ ప్రభాస్ ఆ క్యారెక్టర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసారట. ఈ క్యారెక్టర్ ఆయనకు నచ్చకపోవడం పైగా సినిమాలో అది స్పెషల్ క్యారెక్టర్ కాదు కేవలం గెస్ట్ పాత్ర క్యారెక్టర్ కానీ రియలైజ్ అవ్వడం ఆయనను ఈ పాత్ర నుంచి తప్పించేలా చేశాయి అంటున్నారు జనాలు. చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారిపోయింది..!