లావణ్య త్రిపాఠి.. లావణ్య త్రిపాఠి ..లావణ్య త్రిపాఠి..ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడు మెగా ఇంటి కోడలు.  ఇప్పుడు మెగా ఫ్యామిలీ చరిత్రనే  తిరగరాసేసిన మెగా ఫ్యామిలీ మెంబర్.  సాధారణంగా మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన ఏ చిన్న గుడ్ న్యూస్ తెలిసిన అందరికీ ఒక కామన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అని .. ఆ గ్రూప్ నుండి షేర్ చేసుకుంటారని .. లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని ఆ గుడ్ న్యూస్ ని రివిల్ చేస్తారు అని ..చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు . అయితే ఫర్ ద ఫస్ట్ టైం మెగా రూల్స్ ని బ్రేక్ చేసింది లావణ్య త్రిపాఠి అన్న వార్త బయటకు వచ్చింది .


లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టింది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ వార్తలు పై రకరకాలుగా ట్రోల్ చేశారు జనాలు . వాళ్లందరి నోర్లు మూయిస్తూ అఫీషియల్ గా తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెట్టింది . అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా లావణ్య ప్రెగ్నెంట్ అన్న విషయం ఈ పోస్టు ద్వారానే తెలిసిందట.  ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈ విషయాన్ని ముందే రివిల్ చేయలేదట . నాగబాబు , ఆయన భార్య, నీహారిక కి తప్ప ఈ విషయం మరి ఎవ్వరికి తెలియదట.



ప్రసెంట్ ఆమెకి ఏడవ నెల అంటూ తెలుస్తుంది. అయితే ఆరు నెలల పాటు ఎలా ఈ ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచి పెట్టింది ..? అనేది జనాలకి అర్థం కావడం లేదు . మెగా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఇలా చేసిన మెంబర్ లావణ్య త్రిపాఠినే అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. త్వ్రలోనే మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: