
కాగా రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ 21 ఏళ్లు పూర్తయింది . ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన స్టార్స్ మొత్తం సినిమా షూటింగ్ నాటి మూమెంట్స్ లో గుర్తు చేసుకున్నారు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాకి సంబంధించిన పలు ఫొటోస్ ని షేర్ చేసుకొని తన ఓల్డ్ మెమోరీస్ ని గుర్తు చేసుకున్నారు . కాగా ఇదే మూమెంట్లో ఆర్య సినిమాకి మొదట అనుకున్న హీరో గురించి బయటపడింది. నిజానికి సుకుమార్ ..ఈ సినిమా లో హీరోగా మొదటిగా మహేష్ బాబును అనుకున్నారట .
మహేష్ బాబు అయితే ఈ కథకు బాగా సూట్ అవుతాడు అంటూ ఇంటికి వెళ్లి మరి కృష్ణ గారికి మహేష్ బాబు కి కథ వివరించారట. మహేష్ బాబుకు కథ బాగా నచ్చిందట. కానీ కృష్ణకు మాత్రమే ఈ స్టోరీ అంతగా మహేష్ బాబు ఇమేజ్ కి సూట్ కాదేమో అంటూ భయపడ్డారట. వద్దులే సుకుమార్ అంతూ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ కథలోకి అల్లు అర్జున్ వచ్చాడు . అల్లు అర్జున్ తన కెరీయర్ నే మలుపు తిప్పే విధంగా ఈ సినిమాను మార్చుకునేసాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ స్ధాయిలో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది..!!