నాచురల్ స్టార్ నాని ఆఖరుగా నటించిన నాలుగు మూవీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

హిట్ 3 : నాని తాజాగా నటించిన ఈ సినిమా మే 1 వ తేదీన విడుదల అయింది. శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... శైలేష్ కోలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తాజాగా వారం రోజుల బాక్సా ఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33.44 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ప్రపంచ వ్యాప్తంగా 52.99 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

సరిపోదా శనివారం : నాని హీరో గా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.32 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ప్రపంచ వ్యాప్తంగా 39.07 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

హాయ్ నాన్న : నాని హీరో గా రూపొందిన ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.80 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ప్రపంచ వ్యాప్తంగా 25.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

దసరా : నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు. వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38.21 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ప్రపంచ వ్యాప్తంగా 55.17 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: