
అలా కాల్పుల విరమణ పైన దృష్టి పెట్టినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.. అయితే ఈ ట్విట్ పైన రాంగోపాల్ వర్మ తనదైన సెటైరికల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది.. అంటే నువ్వు చెప్పకుంటే మాకు కామన్ సెన్స్ గాని తెలివిగాని లేవా?.. నువ్వు వచ్చి మాకు అన్ని నేర్పిస్తున్నావా అంటు ఒక సెటైరికల్ ట్విట్ వేశారు. ప్రస్తుతం వర్మ చేసినటువంటి ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ ట్విట్ పైన పలువురు నేటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
అయితే పాకిస్తాన్ మాత్రం వక్రబుద్ధితో అన్ని నియమాలను అతిక్రమిస్తూ నిన్నటి రోజున డ్రోన్లతో మళ్ళీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలను భారత్ ఆర్మీ తెలియజేస్తూ వీటిని గుర్తించి మళ్లీ తిరిగి వాటన్నిటిని కూడా బ్లాస్ట్ చేసామని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మరింత నిజానికి దిగజారి అవకాశం ఉన్నదని అందుకే బోర్డర్లో ఉండేటువంటి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకి రాకూడదంటూ హెచ్చరించారు. మరి ఈ కాల్పుల విరమణ అనేది ఉంటుందో లేదో చూడాలి మరి.