సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే "ఆపరేషన్ సిందూర్" పేరే మారుమ్రోగిపోతుంది . ఈ క్రమంలోనే గతంలో దేశభక్తి చాటుకున్న ఎంతోమంది స్టార్స్ కి సంబంధించిన విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . దేశం మీద ప్రేమతో ఎంతోమంది ప్రాణాలు అర్పించి చరిత్రలో నిలిచిపోయారు . వారి త్యాగాల ఫలితంగానే దేశ ప్రజల ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనే విషయం మర్చిపోకూడదు . దేశం కోసం సేవ చేస్తున్న వారిలో సినీ ఫ్యామిలీకి సంబంధించిన వారు కూడా ఉన్నారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాగా ఓ హీరోయిన్ తండ్రి దేశం కోసం ఏకంగా తన ప్రాణాన్నే త్యాగం చేశారు . ఆయన ఎవరు అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ నటి "నమిరిత కౌర్". యస్ ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. నటి నమ్రిత కౌర్ తండ్రి ఆర్మీ మేజర్ . ఆయన పేరు ఉపేంద్ర సింగ్ . 1994లో కాశ్మీర్ ఉగ్రవాదులతో పోరాడుతూ వారి చేతుల్లో హత్యకు గురయ్యారు . ఈ విషాద సంఘటన గురించి నమిత్ర గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు . చాలా ఎమోషనల్ అయ్యారు. తండ్రి మరణం తర్వాత ఆమె చాలా ధైర్యంగా జీవితాన్ని గడుపుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు.

1994లో కాశ్మీర్లో ఉగ్రవాదులు నమ్రిత తండ్రిని కిడ్నాప్ చేశారు . ఉగ్రవాదులు ఆయనను చిత్రహింసలు పెట్టి తమ డిమాండ్ తీరిస్తేనే వదిలేస్తాము అన్నారు.  వారి డిమాండ్స్ కు ప్రభుత్వం నిరాకరించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు . ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 44 సంవత్సరాలు మాత్రమే. కేవలం నమ్రిత తండ్రి మాత్రమే కాదు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కి కూడా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. సైనిక నేపథ్యాల నుంచి వచ్చిన హీరోయిన్లు బోలెడు మంది ఉన్నారు.  రీసెంట్ గా ఇండియా - పాకిస్తాన్ మధ్య వార్ ఎలా బ్రేక్ పడిందో అందరికీ తెలిసిందే . ఇరుదేశాలు కాల్పుల విరమణను అమల్లోకి తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: