సోషల్ మీడియాలో ఏ విషయాన్ని అయినా సరే హాట్ టాపిక్ గా ట్రెండ్ చేయడం రాద్ధాంతంగా చేసేయడం ఈ మధ్యకాలంలో కొంతమంది జనాలకు బాగా అలవాటుగా మారిపోయింది.  మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయాన్ని వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ చేయడమే కాదు నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య చిచ్చుపెట్టే రేంజ్ కి ఆ గొడవలు వెళ్లిపోతాయి అంటూ జనాలు మాట్లాడుకునే స్థాయికి ఆ న్యూస్ ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుణ్యమా అంటూ నందమూరి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్ధాయి ఉంది .


అయితే నందమూరి ఫ్యామిలీ హీరోస్ మధ్య కూడా గొడవలు ఉన్నాయి అంటూ కొన్ని సందర్భాలలో బయటపడింది . కానీ అది ఏదీ కూడా పెద్ద సీన్ క్రియేట్ చేసే విధంగా మారలేదు . కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉండడం పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది . అంతేకాదు ఈ హీరో కటౌట్ చూసి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేసే లెవెల్ కి ఈ తారక రామారావు వెళ్ళిపోతాడు అంటూ కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని గెలుకుతున్నారు కొందరు ఫేక్ నందమూరి అభిమానులు .



మనకు తెలిసిందే తారకరామారావు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఒక భారీ చిత్రం తరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా వీణ రావు నటిస్తుంది.  ఈ సినిమా మొత్తం కూడా 1980 బ్యాక్ డృఆప్ లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం . హైలెట్ ఏంటంటే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి అదేవిధంగా చంద్రబోస్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అదే విధంగా సాహిత్యాలను అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.  కానీ చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేసే రేంజ్ కి ఈ తారక రామారావు వెళ్ళిపోతాడు అని ఆ హీరో కటౌట్ చూసి చెప్పేస్తున్నారు . ఇది టూ మచ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: