గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తాజా గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది .. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకలో సాలిడ్ అంచనాలు పెంచేసింది .. దర్శకుడు బుచ్చిబాబు సోనా తెర్కక్కిస్తున్న ఈ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ మరోసారి తన ఏంటో చూపించడాని కి రెడీ అవుతున్నాడు .. అలాగే ఈ సినిమా ను మేకర్స్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా గా తీసుకురాబోతున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయా లు తాజా గా బయట పెట్టాడు . ప్రస్తుతం చరణ్ లండన్ లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందు కు వెళ్లిన విషయం తెలిసిందే ..


అయితే అక్కడ ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమా పై కొన్ని కీలక అప్డేట్లు వదిలారు .. ఇక పెద్ది సినిమా ఇప్పటికే 30 % షూటింగ్ పూర్తయింద ని ఈ సినిమా చరణ్ గత సినిమా రంగస్థలం కంటే కూడా ఎంతో బాగుంటుంద ని చరణ్ చెప్పకు వచ్చారు .  ఇక దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుంద ని అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. ఇక మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే .. అలాగే దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ..


ఊరా మాస్ స్పెషల్ స్టెప్పులతో ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఓ క్రేజీ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడట . అయితే ఈ క్రమంలోనే స్టార్ బ్యూటీ తమన్నను ఈ సాంగ్ కోసం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది .. తమన్నా ఈ రీసెంట్‌ టైమ్స్ లో వరుస ఐటం సాంగ్స్ చేస్తూ భారీ క్రేజ్ తెచ్చుకుంది .  పైగా నార్త్ లో కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ మూవీకి అది ప్లస్ అవుతుందని ఉద్దేశంతో ఈమెను తీసుకోబోతున్నారట .  ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది .. గతంలో రామ్ చరణ్ , తమన్నా కలిసి నటించారు .. కాబట్టి ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంది త్వరలోనే దీనిపై కూడా అధికార ప్రకటన రాబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: