స్టార్ హీరో అక్కినేని నాగార్జున నిత్యం ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఈయన తెలుగుతో పాటుగా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించారు. నాగార్జున నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుని ఎన్నో అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా ఆయన నిర్మాతగా కూడా మంచి స్థానాన్ని ఏర్పచుకుని అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. కింగ్ నాగార్జున శివ, అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుని..  నాగర్జున సినీ కెరీర్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు.

ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, రాజన్న, సంతోషం, మన్మధుడు, యువకుడు, ప్రేమకథ, గీతాంజలి, విక్రమ్, నిర్ణయం, కిల్లర్, హలో బ్రదర్, క్రిమినల్, నా సామిరంగా, బంగార్రాజు వంటి సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా టాలీవుడ్ లో హిట్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2024 భారతీయ తెలుగు భాషా పీరియడ్ యాక్షన్ డ్రామా. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. నాగార్జున దాదాపు 100కు పైగా సినిమాలలో నటించారు. అక్కినేని నాగార్జున నటుడిగా, నిర్మాతగానే కాకుండా బిగ్ బాస్ షోలో హోస్ట్ గా కూడా వ్యవహరించి.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

అయితే త్వరలో కింగ్ నాగార్జున, తమిళ డైరెక్టర్ కార్తీక్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. డైరెక్టర్ కార్తీక్, నాగార్జునకి కథ చెప్పారట. అది నాగార్జునకి కూడా నచ్చిందట. దీంతో త్వరలోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోందని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగార్జున, రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: