
గుడ్ బాడ్ అగ్లీ తో అజిత్ ని చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది .. అలాగే తనకు బాలయ్య లాంటి మాస్ హీరో తగిలితే కథే వేరుగా ఉంటుంది అందుకే బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకోవడం వినిపించడం అన్ని చకచక జరిగిపోయాయి .. ఇక బాలకృష్ణ కూడా ఈ దర్శికుడుతో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగానే ఉన్నారు . అయితే ఇక్కడ కాకపోతే బాలయ్య లైన్ అప్ వచ్చే రెండేళ్లకు సరిపడా ఉంది .. ఇక వచ్చే జూన్‌లో గోపీచంద్ మలినెని సినిమాని మొదలు పెడతారు .. ఆ తర్వాత క్రిష్ సినిమా ఉండొచ్చని అంటున్నారు .. అలాగే ఈ రెండు సినిమాలని ఒకేసారి పూర్తి చేయాలన్నది బాలయ్య ప్లాన్ మధ్యలో జైలర్ 2 కి ఓకే చెబుతారు ..
ఈ సినిమాల తర్వాతే అధిక్ సినిమా ఉండొచ్చు గోపీచంద్ మలినేని సినిమా అని వీలైనంత త్వరగా పూర్తిచేసే అవకాశం ఉంది . క్రీష్ సినిమా మాత్రం కొంత టైం పడుతుందని అంటున్నారు . ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పేట వేసే స్టోరీ అట .. ఇక వీటికి తోడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆ సినిమాతోనే ఉండబోతుంది కాబట్టి ఆ సినిమాని ఎలాంటి కంగారు లేకుండా నిదానంగా పూర్తి చేయాలి. ఈలోగా హిందూపూర్ ఎమ్మెల్యే బాధ్యతలు , బసవతారకం పనులు ఉంటాయి .. వీటన్నిటికీ టైం కేటాయించాలి . ఇప్పుడు కొలీవుడ్ దర్శకుడు కథని ఒకే చేసిన పట్టా లెక్కించడానికి టైం పెట్టే అవకాశాలు ఉన్నాయి .. కాకపోతే ఈ కాంబో ఎప్పుడు సెట్ అయిన క్రేజ్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ..