
ఈ సినిమా చాలా చాలా పాజిటివ్ టాక్ దక్కించుకుంది . అంతే కాదు ప్రతి ఒక్కరు కూడా సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడింది సమంత . ఈ సినిమాలో స్పెషల్ గా " మాయ " అనే పాత్రలో కూడా మెరిసింది . అయితే సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాను ప్రమోట్ చేయడానికి పలువురు బడా తెలుగు స్టార్ హీరోస్ వద్దకు వెళ్ళినప్పుడు ఆ స్టార్ హీరోస్ అపాయింట్మెంట్ ఇవ్వకుండానే సినిమా ప్రమోట్ చేయలేమంటూ పరోక్షంగా వేరే పనిలో బిజీగా ఉన్నామంటూ సమంత మ్యానేజర్ కి నిర్మొహమాటంగా చెప్పేసారట . గతంలో ఆ స్టార్ హీరోలు.. సమంతను వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ వాడేసేవారు.
డైనమిక్ లేడీ అని.. కష్టపడుతూ పైకి వచ్చిన అమ్మాయి అని .. ఇండస్ట్రీలో ఎంతోమందికి రోల్ మోడల్ అంటూ చాలా చాలా హై రేంజ్ లో ప్రశంసించేవారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అసలు సమంతని పట్టించుకోవడమే మానేశారు . అంతే కాదు ఒక హీరో అయితే " ఏకంగా ఆమె మన సినిమాలో వద్దు ఆమెపై జనాలు ఎక్కువగా నెగిటివిటీ చూపిస్తారు" అంటూ స్వయాన తెలుగు హీరో తెలుగు డైరెక్టర్ కి చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే సమంత శుభం సినిమా ప్రమోషన్స్ కి ఏ పెద్ద స్టార్స్ ని కూడా వాడుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యి.. ఆమె తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుంది .
అనుకున్న విధంగానే సూపర్ సక్సెస్ అయ్యింది . అయితే రీసెంట్గా శుభం సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ కి అదేవిధంగా చిత్ర బృందం కి స్పెషల్ గా పార్టీ ఇచ్చిందట సమంత . ఇదే మూమెంట్ లో తన ఫ్రెండ్స్ వద్ద స్టార్ హీరోస్ తన సినిమాని ప్రమోట్ చేయడానికి ఇష్టపడలేదు అన్న విషయాన్ని బయట పెట్టిందట . అంతేకాదు "బడాస్టార్స్ అంటేనే అంత ..క్రేజ్ ఉన్నప్పుడు వాడుకొని వదిలేస్తారు ..క్రేజీ లేకపోతే అసలు పట్టించుకోరు ..అలాంటి వాటి గురించి పట్టించుకోని నా టైం వేస్ట్ చేసుకోను" అంటూ ఫ్రెండ్స్ తో క్లారిటీగా చెప్పేసిందట సమంత. ఆమె ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేస్తున్నారు . సమంత క్యారెక్టర్ అలాంటిది కాదు అని .. తనని నమ్మించి మోసం చేసిన సరే సమంత వాళ్ళను క్షమిస్తుంది అని .. ఎవరో కావాలనే సమంత పై ఇలా లేనిపోని నిందలు వేస్తూ ఆమె కెరీర్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అని సమంత ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. నిజా నిజాలు ఆ దేవుడికే తెలియాలి..!