ఇక ఈ సంక్రాంతి కి బాలయ్య తో డాకు  మహారాజ్ త‌ర్వాత‌ వెంటనే మరో సినిమా చేయాలని దర్శకుడు బాబి చెయ్యని ప్రయత్నాలు లేవు .. కానీ హీరోలు ఖాళీగా లేరు .. అయితే మెగాస్టార్ లేదంటే బాలయ్య తోనే మరో సినిమా చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి .. కానీ బాలయ్య రెండు సినిమాలు ఇప్పుడు ఓకే చేసి ఉన్నాడు .. పైగా డాకు మహారాజ్ పెద్దగా హిట్టు కాదు దాంతో బాబీకి మిగిలిన ఏకైక ఆప్షన్ మెగాస్టార్ మాత్రమే .. అయితే ఇక్కడ చిరంజీవి రెడీగాని ఉన్నారు కానీ నిర్మాతలు మాత్రం రెడీగా లేరు ..


దర్శకుడు బాబి మీద ఉన్న విమర్శ ఏమిటంటే డబ్బులు భారీగా ఖర్చు చేయిస్తారని డాకు మహారాజ్ కూడా అదృష్టం కొద్దీ నాన్ థియేటర్ ఆదాయం వల్ల నిర్మాత బయటపడ్డారు .. అయితే ఇక్కడ అందరూ నిర్మాత నాగ‌ వంశీయులు కాదు కదా నాన్ ధియేటర్ ఆదాయం పక్కాగా ప్లాన్డ్గా తెచ్చుకోవడానికిి .  అందుకే ఇక్కడ టాలీవుడ్ లో ఉన్న చాలా మంది నిర్మాతలు ఈ కాంబినేషన్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి .  అయితే ఇప్పుడు కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ఓ అడుగు ముందుకు వేసి ముందుకు వచ్చిందని తెలుస్తుంది .  


ఇక ఈ  సంస్థ‌ ఎప్పటినుంచో తెలుగు చిత్ర పరిశ్రమం లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది .. ఇప్ప‌టికే చాలామందికి అడ్వాన్సులు కూడా ఇచ్చింది .. అందులో మెగాస్టార్ దగ్గర కూడా అడ్వాన్స్ ఉంది ..అయితే ఇప్పుడు కె.వి.ఎన్ కు బాబికి కూడా ఓ మాట కుదిరింది . ఇక సెట్ కావాల్సింది మెగాస్టార్ మాత్రమే ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు రాగానే డిస్కషన్లు మొదలవుతాయని అవి ఓకే అయితే ఈ సినిమా ఫిక్స్ అయిందని కూడా తెలుస్తుంది .. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై కూడా అధికార ప్రకటన రాబోతుంద ని కూడా అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: