
ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి విమర్శకుల నుండి కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుని ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ మూవీ తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో కూడా రిలీజ్ అయ్యింది. ఇక రూ. 100 కోట్లు దాటిన తొలి సినిమాగా దుల్కర్ సల్మాన్ కెరీర్ లో లక్కీ భాస్కర్ సినిమా నిలిచింది.
అయితే దుల్కర్ సల్మాన్ మరో సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నాడు అంట. ఆ సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ సినిమాకు హీరో నాని నిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ఇటీవలే నాని కూడా హిట్ 3 సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు.