
ఈ వయ్యారి మల్టీ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించడమే కాకుండా చిలుక ఆకారంలో ఉండే ఓ ఆకర్షణీయమైన బ్యాగుతో రెడ్ కార్పెట్‌పై హొయలు పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే కేన్స్ 2025లో ఊర్వశి ధరించిన డ్రెస్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెక్సికన్ కళతో మైఖేల్ సింకో ఎంతో ప్రత్యేకంగా ఆ గౌనును డిజైన్ చేశారు. దీని విలువ 4.84 మిలియన్ల డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో రూ. 40.19 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.
అలాగే ఆమె చేతిలో చిలుక ఆకారంలో ఉన్న మినీ బ్యాగ్ జుడిత్ లీబర్ బ్రాండ్‌కు చెందింది. దాని ధర సుమారు రూ. 4 లక్షలు. ఫ్యాషన్ ప్రియులను ఊర్వశి కేన్స్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటున్నా.. సామాన్యులకు మాత్రం ఆమె డ్రెస్ ధర తెలిసాక దిమ్మతిరిగిపోతుంది. అయితే ఊర్వశి లుక్‌పై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. 2018లో ఐశ్యర్యారాయ్ కూడా సేమ్ అటువంటి మల్టీకలర్ గౌనునే ధరించింది. దాంతో ఐశ్వర్య లుక్‌ను ఊర్వశి కాపీ చేసిందంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు