- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన కింగ్డమ్ మూవీ స్టోరీ గతంలో చిరంజీవి , కమలహాసన్ , అమితాబ్ బ‌చ్చన్ వంటి అగ్ర హీరోలు చేసిన మాస్ యాక్షన్ సినిమాలకు దగ్గరగా ఉంటుందని రౌడీ హీరో అంటున్నాడు . ఈ రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు ఎంతగానో మిస్ అయ్యారని , అందుకే కింగ్డమ్ తాను చేశానని ఆయన చెబుతున్నాడు .. అంతేకాకుండా గతంలో కమలహాసన్ చేసిన ఓల్డ్ స్కూల్ డ్రామా టైపులో ఈ సినిమా ఉంటుందట .. అలాగే ఇలాంటి సినిమాలుని గతంలో అమితాబ్ బ‌చ్చన్ బాలీవుడ్ లో కూడా చేశారు .. షోలే , దివార్ ఇలాంటి సినిమాలే .. ఇక మన తెలుగులో ఇలాంటి మాస్ యాక్షన్ సినిమాని చిరంజీవి గారు ఎన్నో చేశారు ..


అలా గతంలో వచ్చిన సినిమాల్లో ఉన్న ఫుల్ డ్రామా యాక్షన్ ఈ కింగ్డమ్ లో మీకు కనిపిస్తుంది .. అలాగే వ్యక్తిగతంగా విజయ్ దేవరకొండకు నాటకాలు , డ్రామాలు అంటే ఎంతో ఇష్టమట .. అలాంటి డ్రామా ఎమోషన్ రాయడం లో దర్శకుడు గౌతమ్ ఎంతగానో పండిపోయారని , అలాగే ఇందులో హీరో గా విజయ పాత్ర కూడా బాగా నచ్చడం తో వెంటనే సినిమా చేయడాని కి ఓకే చెప్పినట్లు విజయ రీసెంట్గా  చెప్పుకొచ్చాడు . అలాగే నిజానికి కింగ్డమ్ తో పాటు మరో డిఫరెంట్ స్టోరీ కూడా చెప్పారట గౌతమ్ .. ఇక అది కూడా బాగా నచ్చిందట అందుకే దాన్ని అలానే పక్కన పెట్టి ఉంచారట .. రాబోయే రోజుల్లో ఆ కథ కూడా తానే చేస్తానని కూడా విజయ్ ఆయనకు మాటిచ్చారట .. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ మూవీ మరో నెల రోజులకు వాయిదా పడింది .. అంటే విజయ్ కింగ్డమ్ వచ్చే జూలై 4కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: