
ఇక మన టాలీవుడ్ లో ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ ముందు కు రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరో గా ఇవానా , కేతిక శర్మ హీరోయిన్ల గా .. దర్శకుడు కార్తీక్ రాజు తెర్కక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ మూవీ సింగిల్ .. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హీరో శ్రీ విష్ణు కెరియర్ లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది .. ఇక మరి ఈ సినిమా మొదటి వారం రోజుల రన్ థియేటర్స్ లో ఎంతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగా ఇక మరి ఈ వారం రోజుల్లో సాలిడ్ మార్క్ టచ్ ను ఈ సినిమా రీచ్ అయినట్టు గా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి .. ఇక దీంతో సింగిల్ సినిమా కేవలం వారం రోజుల్లో నే రూ . 25 కోట్ల గ్రాస్ మార్క్ ని ప్రపంచవ్యాప్తం గా అందుకున్నట్టు గా తెలుస్తుంది ..
ఇక దీంతో సింగిల్ సినిమా గతం లో శ్రీ విష్ణు నుంచి వచ్చిన సామజవరగమన తర్వాత మరో పెద్ద హిట్ గా నిలిచింది .. ఇక ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్ కూడా ఓ కీలక పాత్ర లో నటించ గా వెన్నెల కిషోర్ సాలిడ్ కామెడీ ప్రేక్షకుల ను ఎంత గానో నవ్వించింది .. అలాగే ఈ సినిమా కి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించ గా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ పై ఈ సినిమా ను నిర్మించరు . రిలీజ్ విషయంలో అల్లు అరవింద్ ప్లానింగ్ ఎంత గొప్పగా వర్కౌట్ అవుతుందో చెప్పడానికి సింగిల్ మరో ఉదాహరణగా నిలుస్తోంది. తండేల్ ని సైతం ఇదే తరహాలో ఫిబ్రవరిలో సెట్ చేసిన గీత ఆర్ట్స్ ఇంతకు మించిన ఫలితాన్ని అందుకుంది. కంటెంట్ కన్నా ముఖ్యంగా రిలీజ్ టైమింగ్ ప్రాముఖ్యత చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ.ఇలా అల్లు అవవింద్ మరో భారీ విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నాడు ..