
అయితే ఈ రూమర్లు మరింత ఎక్కువైన నేపథ్యంలో మేనేజర్ నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. సమంత శుభం సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యుసర్ గా వ్యవహరించారు. తాజాగా రాజ్ తో కలిసి దిగిన ఫోటోలను సమంత షేర్ చేయడం గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. శుభం సినిమా నిర్మాతగా సమంతను మరో మెట్టు పైకి ఎక్కించిందని చెప్పవచ్చు.
సమంత తొలి సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాలి. జన్మజన్మల బంధం అనే సీరియల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన శుభం సినిమా టైమ్ పాస్ కోసం సినిమా చూసేవాళ్లకు నచ్చేలా ఉంది. సమంత ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరవగా ఆ పాత్ర మరీ ఆకట్టుకునేలా అయితే లేదని చెప్పాలి. సమంత రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు.
సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ హీరోయిన్ విభిన్నమైన ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి. సరైన ఆఫర్లు దక్కితే సమంత సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. సమంత లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పరంగా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. సమంత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.