
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి - బాలయ్య - నాగార్జున - వెంకటేష్ . ఎటువంటి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిందే . బాలయ్య మినహా మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ చెప్పిన కథలకే ఓకే చేస్తున్నారు. వాళ్ళ లుక్స్ కి .. వాళ్ళ ఫిజిక్ కి ..వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ సినిమాలు సెట్ అవుతాయి అన్న విషయాన్ని వదిలేస్తున్నారు. బాలయ్య మాత్రం తనకి లె హిట్ తెచ్చి పెట్టిన మాస్ సినిమాలను అస్సలు వదులుకోవడం లేదు . ఒక పక్క సెంటిమెంట్ మరొక పక్క మాస్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు .
అయితే ఇప్పుడు చిరంజీవి - వెంకటేష్ - నాగార్జున కూడా బాలయ్య రూట్ లోనే ముందుకు వెళ్తున్నారు. డైరెక్టర్స్ చెప్పిన ప్రతి కథకు ఓకే చేయకుండా వాళ్ళ బాడీ నేచర్ కి తగ్గ కథలను చూస్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు . అందుకే నాగార్జున తన 100వ సినిమాకి డైరెక్టర్ గా ఎంతోమంది స్టార్స్ లైన్లో ఉన్నా కానీ నాగార్జున తన బాడికి ఏ కధ సూట్ అవుతుంది.. ఆ కథను ఏ డైరెక్టర్ ఎంత బాగా తెరకెక్కిస్తాడు అనే విషయాన్ని పరిశీలించి మరీ తన 100వ డైరెక్టర్ ను చూస్ చేసుకుంటున్నారట . అదే విధంగా చిరంజీవి సైతం అనిల్ రావిపూడి సినిమాకు కమిట్ అయ్యే ముందు ఇదేవిధంగా ఆలోచించారట .
నిజానికి చిరంజీవిను కామెడీ యాంగిల్ లో చూసి మనం చాలా కాలమే అయిపోతుంది . "ఘరానా మొగుడు" లాంటి స్టైల్ సినిమా చిరంజీవి ఖాతాలో పడితే ఇక ఆయనను ఢీకొట్టే హీరోనే లేడు ఇండస్ట్రీలో అని చెప్పుకోవడం సందేహం లేదు . జనాలకు విక్టరీ వెంకటేష్ అనగానే ఫ్యామిలీ సెంటిమంటే గుర్తొస్తుంది. అలాంటి సెంటిమెంట్ సినిమా "సంక్రాంతికి వస్తున్నాం" ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి సీనియర్ హీరోస్ మెల్లమెల్లగా వాళ్ల మనసులోని మాటలని డైరెక్టర్స్ కి చెప్పి..మేమంటే ఇది ..మాకు ఇలాంటి సినిమా కావాలి అని మాట్లాడే స్ధాయికి వచ్చేసారు. ఒకందుకు ఇది సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కి మంచిదే..!