టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో ఆశకా రంగనాథ్ హీరోయిన్గా నటించగా ... విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తర్వాత నాగార్జున సోలో హీరో గా ఏ మూవీ కి కమిట్ కాలేదు.

ప్రస్తుతం నాగార్జున , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా రూపొందుతున్న కుబేర సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే రజినీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ మూవీ లో కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ హీరోలకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా నాగార్జున హీరో గా రూపొందిన రగడ మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

మూవీ కి వీరు పట్ల దర్శకత్వం వహించగా ... అనుష్క , ప్రియమణిమూవీ లో హీరోయిన్లుగా నటించారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని త్వరలోనే రీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ బృందం వారు సన్నాహాలు చేస్తున్నారు తెలుస్తోంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: