మల్టీ స్టారర్ మూవీ అనగానే ప్రెసెంట్ అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది "ఆర్ఆర్ఆర్" అనే సినిమా గురించే.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ "రణం రౌద్రం రుధిరం" అనే సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుని సైతం తీసుకొచ్చింది . ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించారు.


సాధారణంగా ఇద్దరు బిగ్  స్టార్స్ ని పెట్టి మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాలి అంటే కచ్చితంగా అభిమానుల దగ్గర నుంచి నెగిటివ్ రియాక్షన్స్ వస్తాయి.  ఒక హీరోని ఎక్కువ చేసి చూపించిన మరొక హీరోని తక్కువ చేసి చూపించిన ..అసలు ఆ ఉద్దేశంతో డైరెక్టర్ అలాంటి సీన్స్ తెరకెక్కించకపోయినా మా హీరో తోపు అంటే మా హీరో తోపు అంటూ ఫ్యాన్స్ కొట్టుకొని చస్తారు . ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా అదే జరిగింది . చరణ్ ని హైలెట్ చేస్తూ తారక్ ని తొక్కేశాడు అంటూ రాజమౌళి పై నందమూరి ఫ్యాన్స్ ఆ టైంలో మండిపడ్డారు.  కానీ ఎన్టీఆర్ మాత్రం  సైలెంట్ గా ఉండిపోయాడు.



అయితే ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే వీళ్ల కాంబోలో ఒక సినిమా రావాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు . ఆ సినిమా మరేంటో కాదు "ఎవడు". వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ గా కనిపించారు. నిజానికి ఆ పాత్ర గెస్ట్ అపీరియన్స్ గా రాసుకోలేదట . ఒక మల్టీస్టారర్ మూవీ గానే రాసుకున్నారట . అది కూడా ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారట . కానీ ఎన్టీఆర్ ఆ పాత్ర ని రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఆ పాత్రలోకి అల్లు అర్జున్ వచ్చాడు .



అయితే అల్లు అర్జున్ ఫిజిక్ కి అంత పెద్ద లెంతీ క్యారెక్టర్ సూట్ కాకపోవచ్చు అంటూ అది కాస్త గెస్ట్ పాత్రగా మార్చేసారట వంశీ పైడిపల్లి. ఎవడు సినిమా మంచి హిట్ అందుకుంది . శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించింది . కాజల్ అగర్వాల్ - అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో మెరిశారు. సోషల్ మీడియాలో అప్పట్లో ఎన్టీఆర్ - చరణ్ లని విడగొట్టడానికి అల్లు అర్జున్మూవీ యాక్సెప్ట్ చేశారు అని వీళ్ళిద్దరి కాంబో సెట్ కాకపోవడానికి అల్లు అర్జున్ కారణమంటూ బాగా ట్రోల్ చేశారు . కానీ నిజం ఏంటంటే ఎన్టీఆర్ నే ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారు.  ఆ తర్వాత అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్ లో గెస్ట్ పాత్రలో సెలెక్ట్ అయ్యారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr