
అందాలపరంగా కూడా యంగ్ హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది . కాగా ఇప్పుడు ఈ ఫరియా చేసిన ఒక గబ్బు పని ఆమెని అరెస్ట్ చేయించింది . మనకు తెలిసిందే గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ ఓ మర్డర్ కేస్ లో ప్రధాన నిధితురాలుగా అరెస్టు అయింది అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి . కాగా పోలీసులు కూడా హీరోయిన్ అరెస్ట్ విషయాని కన్ ఫామ్ చేశారు. ఇది నిజమే అంటూ పోలీస్ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వడంతో సినీ జనాలు షాక్ అయిపోతున్నారు. అసలు ఆమెని ఎందుకు అరెస్ట్ చేశారు..? అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.
గత ఏడాది జూలైలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని అల్లర్లలో ఒక విద్యార్థి చాలా దారుణ హత్యకు గురైంది . అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది ఈ ఇష్యూ. అయితే ఈ వ్యవహారంలో నటి ఫరీయా ప్రధాన పాత్ర పోషించింది అని ఆమెతో పాటు దాదాపు 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు మోపబడ్డాయి . ఈ కేస్ కారణంగానే బాంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రభుత్వం కూడా కూలిపోయింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఫరియా తాజాగా పక్క ఆధారాలతో పోలీసులకి దొరికిపోయింది .
పోలీస్ అధికారి సుజన్ మాట్లాడుతూ .."కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించింది అని ..ప్రస్తుతం ఆమెను వతార పోలీసు లు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని" క్లారిటీ ఇచ్చారు . బాంగ్లాదేశ్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ కి ఇదేం పోయేకాలం అంటూ జనాలు బూతులు తిడుతున్నారు. అంతేకాదు ఒక హీరోయిన్ అరెస్ట్ అయింది అని తెలియగానే సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది . అది కూడా ఒక మర్డర్ కేసులో హీరోయిన్ అరెస్ట్ అయింది అని తెలిసి జనాల షాక్ అయిపోతున్నారు..!